News July 26, 2024

విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసిన కలెక్టర్

image

అనంతపురంలోని నాలుగవ రోడ్డులో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగరపాలక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పుస్తకాలు, మొక్కలు పంపిణి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్నప్పటి నుంచి సామాజిక సేవల పట్ల అవగాహన ఉండాలని, నలుగురికి సహాయం చేసే వ్యక్తిత్వం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

Similar News

News October 12, 2024

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే 88852 89039కు సమాచారం ఇవ్వాలన్నారు.

News October 12, 2024

గ్యాంగ్ రేప్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి: సీపీఐ

image

చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో బళ్లారి నుంచి ఉపాధి కోసం వచ్చిన కుటుంబంలోని వాచ్‌మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ్ డిమాండ్ చేశారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్త, కోడలిపై గ్యాంప్‌ రేప్‌నకు పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమన్నారు.

News October 12, 2024

నిందితులను వెంటనే అరెస్ట్ చేయండి: మంత్రి సవిత

image

చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లి గ్రామంలో అత్తా-కోడలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నవిత స్పందించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు చోటు లేదని, వీలయినంత త్వరగా నిందితులను పట్టుకోవాలన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.