News February 15, 2025
విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.
Similar News
News December 1, 2025
మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

బాడీలో సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అయినపుడు చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. దాన్నే డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. ఈ టైప్ స్కిన్కి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇన్ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లు వస్తాయి. ఈ స్కిన్ టైప్ వారు సున్నితమైన క్లెన్సర్&హ్యూమెక్టెంట్స్ ఉండే మాయిశ్చరైజర్ని ఎంచుకుంటే చర్మం తేమగా, తాజాగా ఉంటుందంటున్నారు.
News December 1, 2025
అర్జీల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు చేపడతామని కలెక్టర్ మహేశ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన పీజీఆర్ఎస్ను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, మొత్తం 135 అర్జీలను స్వీకరించారు.
News December 1, 2025
దూడల్లో నట్టల బెడద – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.


