News March 12, 2025
విద్యార్థులకు బహుమతులు అందజేసిన ASF కలెక్టర్

బెజ్జూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలోని విద్యార్థులు సాఫ్ట్బాల్, కరాటే, బేస్బాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. MLA హరీశ్ బాబు, సబ్ కలెక్టర్లు దీపక్ తివారీ, శ్రద్ధా శుక్లా, ప్రిన్సిపల్ అరుణ, పీఈటీ చెంచులక్ష్మి పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
14 ఏళ్లకే ప్రేమ, జంప్.. ఎందుకిలా?

విజయవాడకు చెందిన బాలిక(14), బాలుడు(13) ఇంటి నుంచి పారిపోవడంపై నెటిజన్లు షాకవుతున్నారు. అంతచిన్న వయసులో ఇలాంటి ఆలోచన, ధైర్యం రావడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియా వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. బుధవారం బాలుడు తన తండ్రి ఫోన్, రూ.10వేలు తీసుకుని అమ్మాయితో హైదరాబాద్ వచ్చాడు. తుక్కుగూడలో రూమ్ కోసం వెతుకుతుండగా ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పేరెంట్స్కు అప్పగించారు.
News November 28, 2025
GWL: నామినేషన్లలో డిక్లరేషన్ తప్పనిసరి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన శెట్టి ఆత్మకూరు, సంగాల, గోనుపాడు సహా పలు గ్రామ పంచాయతీల్లోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థుల వివరాలను ఓటరు జాబితాతో సరిచూసుకోవాలని, నిర్దేశించిన డిపాజిట్ మాత్రమే స్వీకరించి రసీదు ఇవ్వాలని ఆయన సూచించారు.
News November 28, 2025
ఖమ్మం: ఎన్నికల విధులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి

ఎన్నికల విధులను అధికారులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామ రావు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, ఎంసీఎంసీ సెల్, మీడియా సెంటర్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.


