News February 4, 2025
విద్యార్థులకు షీ టీంపై అవగాహన కల్పించిన పోలీసులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీం పోలీసుల ఆధ్వర్యంలో రంగంపేట్లోని ఓ అకాడమీ విద్యార్థులకు షీ టీం పని తీరుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి, అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, ఉమెన్ ట్రాఫికింగ్, వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలపై షీ టీం పోలీస్ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Similar News
News February 4, 2025
WGL: తీవ్ర విషాదం.. అన్న మృతి తట్టుకోలేక తమ్ముడు మృతి
వరంగల్ నగరంలో తీవ్రవిషాదం నెలకొంది. అన్న మృతి తట్టుకోలేక తమ్ముడు సైతం మృతి చెందిన ఘటన ఈరోజు ఉదయం జరిగింది. శివనగర్కు చెందిన శంకర్ సింగ్ గత రాత్రి గుండెపోటుతో మరణించాడు. కాశిబుగ్గకు చెందిన తమ్ముడు రతన్ సింగ్ ఈరోజు ఉదయం అన్న మృతదేహం చూసి, ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఉదయం తమ్ముడు సైతం మరణించారు. ఒకరోజు వ్యవధిలోనే ఇద్దరు అన్నదమ్ములు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది.
News February 4, 2025
వరంగల్: బాలికపై అత్యాచారం.. పోలీసులకు ఫిర్యాదు
వరంగల్ నగరంలో దారుణం జరిగింది. ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. వరంగల్ డివిజన్లో ఇంటర్ చదువుతున్న బాలిక(16)పై యువకుడు అత్యాచారం చేయడంతో ఏడు నెలల గర్భవతి అయింది. దీంతో బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News February 4, 2025
నులి పురుగుల నివారణ కోసం శిక్షణ
జాతీయ నులి పురుగుల నివారణ కోసం వరంగల్ డీఎంహెచ్వో కార్యాలయంలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10 నుంచి 17వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 1,810 పాఠశాలు, కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లలో 1,81,807 మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు.