News November 25, 2024
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం పాల్వంచ పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని ఎస్సి బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే పాఠశాల సిబ్బందికి తెలపాలని కలెక్టర్ విద్యార్థినులను సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 7, 2025
మూడో విడత ఎన్నికలు.. 906 నామినేషన్లు ఆమోదం

ఖమ్మం జిల్లాలోని మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 7 మండలాల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను శనివారం అధికారులు పూర్తి చేశారు. ఇందులో సర్పంచ్ 906, వార్డుల స్థానాలకు దాఖలైన 4010 నామినేషన్లను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈనెల 9న మధ్యాహ్నం 3 లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
News December 7, 2025
రెండో విడత ఎన్నికలు.. 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 23 సర్పంచ్, 306 వార్డులు స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. కామేపల్లి S-6 W-67, ఖమ్మం రూరల్ S-2 W-22, కూసుమంచి S-6 W-87, ముదిగొండ S-1 W-27, నేలకొండపల్లి S-3 W-50, తిరుమలాయపాలెం S-5 W-53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 6 మండలాల్లో మిగిలిన 160 సర్పంచ్, 1380 వార్డు స్థానాలకు ఈనెల 14న ఎన్నిక జరగనుంది.
News December 7, 2025
ఏకగ్రీవ పంచాయతీలలోనూ ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులో ఉంటుందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ స్పష్టం చేశారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలలో సైతం ఈ ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.


