News February 8, 2025
విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న MHBD కలెక్టర్

గూడూరులో కేజీబీవీ ఆశ్రమ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉన్న పరిసరాలను పరిశీలించి, విద్యార్థులకు వండిన వంటలను పరిలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను సంబధిత వార్డెన్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాస్ రూమ్లలోకి వెళ్లి విద్యార్థులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమకు విద్యార్దులు తమకు తెలపాలన్నారు.
Similar News
News December 3, 2025
ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆక్టోపస్ ‘మాక్ డ్రిల్’

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆక్టోపస్ డెల్టా టీమ్, గుంటూరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత, ప్రజా రక్షణ కోసమే దీనిని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
News December 3, 2025
124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<
News December 3, 2025
చిత్తూరు: డిప్యూటీ MPDOలకు కీలక బాధ్యతలు

చిత్తూరు జిల్లాలో సచివాలయాలను పర్యవేక్షించేలా డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తున్నారు. మండలంలోని 31 మండలాల్లో 504 గ్రామ సచివాలయాలు, 108 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇప్పటికే 27మంది డిప్యూటీ ఎంపీడీవోలు విధుల్లో చేరారు. సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా వీరు పర్యవేక్షణ చేయనున్నారు.


