News February 8, 2025
విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న MHBD కలెక్టర్

గూడూరులో కేజీబీవీ ఆశ్రమ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉన్న పరిసరాలను పరిశీలించి, విద్యార్థులకు వండిన వంటలను పరిలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను సంబధిత వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాస్ రూమ్‌లలోకి వెళ్లి విద్యార్థులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమకు విద్యార్దులు తమకు తెలపాలన్నారు.
Similar News
News February 8, 2026
ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: CM

TG: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ తర్వాత ఇస్తామని CM రేవంత్ చెల్పూర్ సభలో ప్రకటించారు. గోదావరి సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేసే యోచన లేదన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం చేకూర్చే ఏ పనిని ప్రభుత్వం చేపట్టదని స్పష్టం చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాలను, దేవాలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.3వేలకోట్లయినా ఖర్చు చేస్తామన్నారు.
News February 8, 2026
ఇంగ్లండ్‌పై పోరాడి ఓడిన నేపాల్

T20WC: ఇంగ్లండ్-నేపాల్ మధ్య పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నేపాల్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీపేంద్ర సింగ్(44), కెప్టెన్ రోహిత్ పౌడెల్(39) పోరాటం వృథా అయ్యింది. కుశాల్(29), లోకేశ్(39) కూడా అద్భుతంగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 2, ఆర్చర్, విల్ జాక్స్, సామ్ కరన్, ఉడ్ తలో వికెట్ తీశారు.
News February 8, 2026
స్థానికేతరులు జిల్లాలో ఉండవద్దు: నిర్మల్ ఎస్పీ

ప్రచార సమయం 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రచార సమయం ముగిశాక అభ్యర్థులు లేదా వారి మద్దతుదారులు ఎవరూ కూడా ప్రచారం నిర్వహించరాదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కూడా కోల్పోయే అవకాశముందని హెచ్చరించారు. స్థానికేతరులు ఎవరూ జిల్లాలో ఉండవద్దని హెచ్చరించారు.


