News August 26, 2024
విద్యార్థులను అభినందించిన ఎంపీ కావ్య
ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను వరంగల్ ఎంపీ కడియం కావ్య అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కరాటేతో ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం పెరిగి చదువులో సైతం రాణించే అవకాశం ఉందని, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని అమ్మాయిలు తప్పకుండ కరాటే నేర్చుకోవాలన్నారు.
Similar News
News September 10, 2024
వరంగల్: మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.7,700
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిస్తున్నాయి. మార్కెట్లో ఈరోజు క్వింటా పత్తి ధర నిన్నటి లాగే రూ.7,700 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధర మరింత పెరిగేలా వ్యాపారులు చొరవ తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
News September 10, 2024
వరంగల్: వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పైడిపల్లికి చెందిన స్వాతికి అదే గ్రామానికి చెందిన నిరంజన్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత నుంచి ఆమె భర్త, అత్త కట్నం తీసుకురమ్మని వేధించేవారు. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగినా వేధించడం మానకపోయేసరికి ఈ నెల 5న గడ్డి మందు తాగింది. MGMలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
News September 10, 2024
వరంగల్ భద్రకాళి అమ్మవారి చీరలు పక్క దారి!
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అర్చకులు, ఉద్యోగుల తీరు విమర్శలకు తావిస్తోంది. అమ్మవారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన పలు వస్తువులను కొందరు అర్చకులు, అధికారులు ఫలహారంగా పంచుతున్నట్లు సమాచారం. అమ్మవారికి భక్తులు చీర, సారె, పూజా వస్తువులు, పూలు, పండ్లు ఇతరత్రా వస్తువులు భక్తితో సమర్పిస్తారు. ఇవి పక్కదారి పట్టడం ఆందోళన కలిగిస్తోంది.