News February 7, 2025

విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ

image

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగిన స్కౌట్స్ అండ్ గైడ్స్ డైమండ్ జూబ్లీ జంబోరి వేడుకలలో పాల్గొని ప్రతిభ చూపిన జిల్లా స్కౌట్ విద్యార్థులను అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన ప్రశంసించారు. మున్ముందు మరింత ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

Similar News

News February 28, 2026

పాకిస్థాన్ పిల్లలు, మహిళలను చంపుతోంది: అఫ్గాన్

image

పాకిస్థాన్ యుద్ధనీతిని విస్మరిస్తోందని అఫ్గానిస్థాన్ మండిపడింది. తాలిబన్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు అఫ్గాన్ ముస్లిం పౌరులు, పిల్లలను చంపాలని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాలు జారీ చేశారని స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. ఖోస్ట్, పక్తియాలోని సామాన్యుల ఇళ్లను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతోందని, ఇందులో 19 మంది పౌరులు చనిపోయారని పేర్కొంది. అందులో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారని తెలిపింది.

News February 28, 2026

భారత్ vs వెస్టిండీస్.. రేపు వర్షం పడుతుందా?

image

రేపు కోల్‌కతాలో భారత్-వెస్టిండీస్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీఫైనల్‌లో అడుగుపెట్టనుంది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే తక్కువ నెట్ రన్‌రేట్ ఉన్న IND టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో రేపు కోల్‌కతాలో వర్షం పడే ఛాన్సుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే వర్షం ముప్పు లేదని వాతావరణ అధికారులు చెప్పారు. ఆకాశం క్లియర్‌గా ఉందని, ఎలాంటి మబ్బులు లేవని పేర్కొన్నారు.

News February 28, 2026

ఆదిలాబాద్: ఎడ్లబండి కట్టు.. తాగునీరు పట్టు

image

ఇచ్చోడ మండలంలోని ముఖరా(బి) గ్రామంలో నాలుగు రోజులుగా మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తాగునీటి కోసం గ్రామస్థులు ఎడ్లబండ్లు కట్టుకుని శివారులోని వ్యవసాయ బోరుబావుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని మాజీ సర్పంచ్ మారుతి, గ్రామస్థులు కోరుతున్నారు. వేసవి ఆరంభంలోనే ఈ పరిస్థితి ఉండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.