News February 7, 2025
విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగిన స్కౌట్స్ అండ్ గైడ్స్ డైమండ్ జూబ్లీ జంబోరి వేడుకలలో పాల్గొని ప్రతిభ చూపిన జిల్లా స్కౌట్ విద్యార్థులను అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన ప్రశంసించారు. మున్ముందు మరింత ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
Similar News
News February 8, 2026
కలర్ ఫుల్‌గా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ!

ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే గ్రే/బ్లాక్ కలర్ షేడ్‌లో ఉంటాయనే పేరుంది. అయితే ఎన్టీఆర్‌తో తీస్తున్న సినిమా కలర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. రెగ్యులర్ స్టైల్‌లో కాకుండా కొత్త టేకింగ్‌తో తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం సన్నబడిన ఆయన భారీగా గడ్డం కూడా పెంచారు. కాగా సమ్మర్‌లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని టాక్.
News February 8, 2026
రెండో టీ20కి భారత జట్టుతో చేరనున్న సుందర్: సూర్య

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్‌లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్‌లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్‌రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.
News February 8, 2026
వరంగల్: మల వ్యర్థాలు బహిరంగంగా వేస్తే జైలుకే!

మల వ్యర్థాలను బహిరంగంగా పారబోస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం శానిటేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో సానిటరీ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు.


