News November 6, 2025
విద్యార్థులను ప్రోత్సహించడానికే చెకుముకి పోటీలు: డీఈవో

విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా చెకుముకి పోటీలు నిర్వహించడం అభినందనీయమని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సంగారెడ్డిలోని డీఈవో కార్యాలయంలో చెకుముకి పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ పోటీలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈవో సూచించారు.
Similar News
News April 14, 2026
ASF:నిబంధనలు కాగితాలకే పరిమితమా?

వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించవద్దనే నిబంధనను మెడికల్ షాపుల యజమానులు తుంగలో తొకుతున్నారు. ASF జిల్లాలో మెడికల్ షాపు నిర్వహించే ఫార్మసిస్టు వినియోగదారుడికి కచ్చితంగా మందుల వివరాలతో కూడిన బిల్లు ఇవ్వాలి. కానీ,ఏదో 1, 2 షాపుల్లో తప్ప మిగతా దుకాణాల్లో ఇది అమలు కావడం లేదు. మెడికల్ దుకాణాల యజమానుల యూనియన్ కనుసన్నల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు నడుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News April 14, 2026
KNR: ‘ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి’

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోన్న అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లను సోమవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News April 14, 2026
అమరావతిలో మరో 3,072 ఎకరాల భూసమీకరణ

AP: రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తుళ్లూరు(M) పెదపరిమి పరిధిలో ప్రభుత్వ భూమిని మినహాయించి 3,072 ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు CRDA నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై నెల రోజుల్లో రైతులు అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చని తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ భూమిని వినియోగించనున్నారు.


