News August 7, 2024
విద్యార్థులపై దాడి చేసిన నిందితులు అరెస్ట్

పోలీసులమని బెదిరించి విద్యార్థులపై దాడి చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. ఆకాష్, తరుణ్, జస్వంత్ రాజు అనే విద్యార్థులు రుద్రంపూర్ నేషనల్ హైవే మెయిన్ రోడ్డు దగ్గర రీల్స్ తీస్తుండగా, నలుగురు వ్యక్తులు అక్కడికి వెళ్లి తాము పోలీసులమని వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు CI పేర్కొన్నారు.
Similar News
News December 11, 2025
ఖమ్మం: ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్న ఓటర్లు

జిల్లా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. చక్రాల కుర్చీలో వృద్ధులు, చంటిబిడ్డలతో మహిళలు సైతం పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నా, మొత్తంగా చాలా కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది.
News December 11, 2025
వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ పై నిఘా: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా మొదటి విడత 7 గ్రామపంచాయతీలో జరిగే పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందిని సూచించారు.
News December 11, 2025
KMM: ‘అయ్యా బాబోయ్.. 10 రోజుల్లో రూ.125 కోట్ల మద్యం తాగేశారు’

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు మద్యం, నగదును ప్రధాన హస్తంగా మలుచుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో గడిచిన పది రోజుల్లో రూ.125 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కాగా ఈ నెల 17 వరకు పంచాయతీ ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు మరింతగా పెరిగా అవకాశం ఉంది.


