News February 3, 2025
విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళిక: కలెక్టర్

పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరంలో పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన 16 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో మంజూరైన నిధులు, చేసిన వివిధ అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు.
Similar News
News April 24, 2025
పరకాల: కొడుకుని చంపిన తండ్రి ARREST

కొడుకుని చంపిన తండ్రిని చిట్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. రేపాకపల్లికి చెందిన ఓదెలు పరకాల మండలం సీతారాంపురంకు చెందిన దేవిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో తండ్రి మొండయ్య కొడుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఓదెలు పెళ్లి రోజు మళ్లీ గొడవ జరిగింది. ఈ నెల 22న పడుకున్న ఓదెలుపై మొండయ్య రోకలి బండతో కొట్టి హత్య చేసి పారిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News April 24, 2025
మామునూరు ఎయిర్పోర్ట్ గురించి ఈ విషయాలు తెలుసా..?

WGL మామునూరు ఎయిర్పోర్ట్ను నిజాం పాలనలో 1930లో నిర్మించారు. జవహర్ లాల్ నెహ్రూతో సహా అనేకమంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు 1981 వరకు వారి పర్యటనలకు ఈ విమానాశ్రయం ఉపయోగపడింది. ఈ విమానాశ్రయం షోలాపూర్లో వ్యాపారాభివృద్ధికి, సిర్పూర్ కాగజనగర్లో కాగితం పరిశ్రమ సౌకర్యార్థం నిర్మించారు. ఇది బేగంపేట విమానాశ్రయం కంటే అతి పురాతనమైంది. మామూనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
News April 24, 2025
వరంగల్లో గురువారం మెగా జాబ్ మేళా

వరంగల్ జిల్లాలో గురువారం మెగా జాబ్ మెళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని రజిత తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ కళాశాలలో గల ఎంప్లాయిమెంట్ ఆఫీసుకు రావాలన్నారు. పూర్తి వివరాలకు 7093168464 సంప్రదించాలని కోరారు.