News February 17, 2025

విద్యార్థులు ఇష్టంతో చదవాలి.. కష్టంతో కాదు: కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులు ఇష్టంతో చదవాలని, కష్టంతో కాదని ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ప్రతి ఏడాది వలే ఈ ఏడాది కూడా పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ కోరారు.  మై స్కూల్ -మై ప్రైడ్‌పై హెచ్ఎం, టీచర్స్‌తో కలెక్టర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News November 28, 2025

నిజామాబాద్: విద్యను కార్పొరేట్ ఉత్పత్తి సాధనంగా మార్చాయి

image

దేశంలో విద్యను కార్పొరేటు ఉత్పత్తి సాధనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చాయని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలు ఆర్మూర్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆర్మూర్‌లోని హనుమాన్ ఆలయం నుంచి CVR జూనియర్ కళాశాల వరకు వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన, అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

News November 28, 2025

ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: NZB సీపీ

image

నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించాలంటే సంబంధిత రిటర్నింగ్ అధికారి, పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సీపీ సాయి చైతన్య తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణం అవుతుందన్నారు. జిల్లా పరిధిలో డీజేల వాడకం పూర్తిగా నిషేధం అన్నారు.

News November 28, 2025

శాంతిభద్రతలకు పటిష్ట చర్యలు: KMR SP

image

భిక్కనూర్ మండలం జంగంపల్లి నామినేషన్ కేంద్రాన్ని SP రాజేష్ చంద్ర ఆకస్మికంగా పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగాలని విధుల్లో ఉన్న సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల శాంతిభద్రతల కోసం జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు SP వివరించారు.