News February 17, 2025
విద్యార్థులు ఇష్టంతో చదవాలి.. కష్టంతో కాదు: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులు ఇష్టంతో చదవాలని, కష్టంతో కాదని ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ప్రతి ఏడాది వలే ఈ ఏడాది కూడా పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ కోరారు. మై స్కూల్ -మై ప్రైడ్‌పై హెచ్ఎం, టీచర్స్‌తో కలెక్టర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News March 18, 2025
ఎప్పుడూ నీరసం, అలసటగా ఉంటుందా?

కొందరికి ఎలాంటి శారీరక, మానసిక శ్రమ చేయకపోయినా నీరసం, అలసట వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే దీనిని నివారించవచ్చు. శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఉదయం ఏదో ఒక ఆహారం తింటే నీరసం, అలసట ఉండదు. లంచ్‌లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. వారంలో ఒకరోజుకు మించి ఉపవాసం చేయకూడదు.
News March 18, 2025
నల్గొండ: ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి: SP

జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి గ్రామంలో వీపీవో క్రమం తప్పకుండా సందర్శించి, ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు.
News March 18, 2025
సిద్దిపేట: కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: DMHO

కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్ఓ పల్వాన్ కుమార్ అన్నారు. జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ అరుణ్ కుమార్ అధ్యక్షతన జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్టు రహిత సమాజాన్ని నిర్మించేందుకు జిల్లాలో మార్చి 17 నుంచి 30 వరకు క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని ముందస్తుగా గుర్తించి వైద్యం అందించనున్నట్లు తెలిపారు.