News February 21, 2025

విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలి: పాడేరు జేసీ

image

గిరిజన విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారికి సూచించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం విహార యాత్రకు వెళ్తున్న 120మంది విద్యార్థినులతో పాడేరు ఐటీడీఏలో సమావేశమయ్యారు.

Similar News

News October 23, 2025

భద్రాచలం: నేటి నుంచే పాపికొండల యాత్ర ప్రారంభం

image

తెలంగాణలోని భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ వైపునకు పాపికొండల విహార యాత్ర గురువారం(నేటి) నుంచి ప్రారంభం కానుంది. పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి బోట్లు నడుపుటకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. పోచవరం, పేరంటాలపల్లి మీదుగా పాపికొండల యాత్ర కొనసాగుతుందని చింతూరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఇన్‌చార్జ్ శుభం నోఖ్వాల్ తెలిపారు.

News October 23, 2025

అద్దంకి ప్రకాశం జిల్లాలో కలవనుందా.?

image

బాపట్ల జిల్లా నుంచి అద్దంకిని ప్రకాశం జిల్లాలో తిరిగి విలీనం చేసే అంశంపై సీసీఎల్ఏ ఆధ్వర్యంలో వీక్షణ సమావేశం జరిగింది. అద్దంకి సరిహద్దులపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని, విడదీసినప్పటి ప్రభావంపై అధ్యయనం చేయాలని సూచించారు. వర్షాభివృద్ధి హెచ్చరికలు, నీటి-మట్టి పరిశీలనలు, అర్జీల పరిష్కారం, గృహాల కేటాయింపు ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. డీఆర్ఓ, కలెక్టర్, ఆల్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

News October 23, 2025

వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జామి వాసి

image

వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జామి మండలానికి చెందిన గొర్లె రవిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నియామక పత్రాల జాబితాను ప్రకటించింది. ప్రస్తుతం ఈయన జామి వైసీపీ మండల అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన గొర్లె రవిని జిల్లా ఐ.టి వింగ్ అధ్యక్షుడు అప్పన్న సుబ్రమణ్యం, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు కే. సూరిబాబు అభినందించారు.