News September 30, 2024

విద్యార్థులు కష్టపడి పోటీపరీక్షల్లో రాణించాలి: గోడం నగేశ్

image

హైదరాబాద్‌లోని కొమరం భీం స్టడీ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలన్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, డా.సిడాం మధుకర్, మేస్రం నాగోరావు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 15, 2024

ఆదిలాబాద్: ఈనెల 18న పోటీలు… GET READY

image

ప్రపంచ పర్యాటక దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూడు అంశాలపై ఫోటో ఎక్సిబిషన్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి రవికుమార్ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలు, వైల్డ్ లైఫ్, సంస్కృతి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీలు ఈనెల 18న టీటీడీసీలో ఉంటాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే ఔత్సాహికులు వివరాలకు 9440816087 సంప్రదించాలన్నారు.

News October 15, 2024

నిజాయితీ చాటుకున్న బెల్లంపల్లి కండక్టర్

image

బెల్లంపల్లికి చెందిన బస్ కండక్టర్ గాజనవేణి రాజేందర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ‌మందమర్రికి చెందిన ఓ మహిళ బస్సులో సీటు కోసం పర్సు వేసింది. కాని బస్సులో రద్దీ కారణంగా బస్సు ఎక్కలేకపోయింది. దీంతో ఆమె తన పర్సులోనే మరిచిపోయిన ఫోన్‌కు కాల్ చేయగా కండక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి పర్సును భద్రపరిచి బాధితురాలికి అందించాడు. కాగా పర్సులో రూ. 20వేలు, 2 తులాల బంగారం ఉన్నట్లు సదరు మహిళ తెలిపింది.

News October 14, 2024

ఆదిలాబాద్: కాల్ చేసుకుంటానని చెప్పి… ఫోన్‌తో జంప్

image

ఫోన్ కాల్ మాట్లాడతానని చెప్పి ఓ వ్యక్తి ఫోన్ తీసుకొని పారిపోయిన ఘటన ADBలో చోటుచేసుకుంది. పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సామ సతీష్ రెడ్డి ఆదివారం సాయంత్రం సమయంలో బస్టాండు వద్ద నిలుచున్నాడు. అయితే గుర్తుతెలియని ఓ వ్యక్తి వచ్చి ఫోన్ చేసుకుంటా అని చెప్పి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ మాట్లాడుతూ.. ఫోన్ తీసుకొని పారిపోయాడు. దీంతో బాధితుడు ఆదిలాబాద్ 2 టౌన్ PS లో ఫిర్యాదు చేశాడు.