News March 20, 2025

విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

రేపటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు వ్రాయాలని సూచించారు. విద్యార్థులు సంవత్సర కాలం పాటు ఉపాధ్యాయుల శిక్షణలో ఎంతో శ్రమించి, పట్టుదలతో ఈ దశకు చేరుకుని పూర్తి స్థాయిలో సన్నదం అయ్యారని తెలిపారు.

Similar News

News December 9, 2025

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. మంత్రి విచారం వ్యక్తం

image

నగరి(M) తడుకుపేట సమీపంలో రెండు కార్లు ఢీకొని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి మండిపల్లి స్పందించారు. ఘటన బాధాకరమని, సంతాపం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News December 9, 2025

పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్?

image

వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో హీరోయిన్ నివేదా పేతురాజ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరి వివాహం రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ పోస్ట్‌ను తొలగించడం, ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవలే క్రికెటర్ స్మృతి మంధాన వివాహం కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రద్దయింది.

News December 9, 2025

వాజ్‌పేయి పాలసీలతో అభివృద్ధికి పునాది: CM

image

AP: ఈనెల 11-25 మధ్య జరిగే ‘అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన యాత్ర’లో కూటమి నేతలంతా పాల్గొనాలని CM CBN సూచించారు. వాజ్‌పేయి సుపరిపాలనకు నాంది పలికారని, ఆయన పాలసీలతోనే దేశాభివృద్ధికి పునాది పడిందని చెప్పారు. రోడ్లు, విమానయాన, టెలీ కమ్యూనికేషన్ రంగాల్లో సంస్కరణలు తెచ్చారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించేవారన్నారు. PM మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.