News October 29, 2024

విద్యార్థులు పరిశోధనల వైపు ఆసక్తి పెంచుకోండి: ఇన్‌ఛార్జ్ వీసీ

image

అనంతపురం JNTUలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మంగళవారం DYNAMECHS-2K24 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ రంగం వైపు మాత్రమే కాకుండా.. పరిశోధనల వైపు కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Similar News

News November 13, 2024

పుట్టపర్తి: సత్యసాయి జయంతి వేడుకలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

image

పుట్టపర్తిలో ఈనెల 23 న జరగనున్న భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి వేడుకలకు సీఎం నారా చంద్రబాబునాయుడును ట్రస్ట్ సభ్యలు ఆహ్వానించారు. ఈ మేరకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సత్యసాయి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి ఆహ్వాన పత్రికను ఆయనకు అందించారు. తప్పకుండా ఉత్సవాలకు హాజరు కావాలని సీఎంను కోరారు. 

News November 13, 2024

ATP: ఇటీవలే పెళ్లి.. గుండెపోటుతో యువకుడి మృతి

image

విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ (26) అనే యువకుడు గుండెపోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆటోలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు బాబా ఫక్రుద్దీన్‌కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News November 13, 2024

గుత్తి వద్ద చిరుత సంచారం!

image

అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారు కర్నూల్ రోడ్డులోని మోడల్ స్కూల్ సమీపం గుట్టల్లో మంగళవారం రాత్రి చిరుత కలకలం రేపింది. స్థానికులు గమనించి భయంతో పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు కొండ గుట్టల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బుధవారం ఉదయం కూడా మరోసారి చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.