News January 25, 2025
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీపీ

విద్యార్థులు తమ తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారం అవుతుందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విద్యార్థులకు తెలిపారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కాజీపేట నిట్ కళాశాలలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Similar News
News November 24, 2025
ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణ శరవేగం.. నెరవేరనున్న యువత కలలు

ఖమ్మం జిల్లాలో ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్త ఐటీ కంపెనీలకు సౌకర్యాలు, రాయితీలను ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం 2 వేల మంది ఉద్యోగులు ఉండగా, రాబోయే ఐదేళ్లలో 10 వేలకు పైగా ఐటీ ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కనున్నాయని అధికారులు తెలిపారు.
News November 24, 2025
కల్వకుర్తి: భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎక్వాయిపల్లిలో సోమవారం రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.
News November 24, 2025
అనకాపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి

లోక్ అదాలత్ ద్వారా కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చే నెల 13న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లోనూ లోక్ దాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరు పార్టీల వారు రాజీకి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. దీనివలన సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు.


