News January 31, 2025
విద్యార్థులు మనసుపెట్టి చదువుకోవాలి: DEO

విద్యార్థులు మనసుపెట్టి చదువుకొని చదువులో జీవించాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ హైస్కూల్ లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులను ఏర్పాటు చేశారు. మార్చి 21న పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని, ప్రతి విద్యార్థి పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. ఎంఈఓ ధనుంజయ, కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మణ్, ఎస్సై ప్రవీణ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News February 19, 2025
మెదక్: ఎన్నికల విధులపై కలెక్టరేట్లో సమీక్ష

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎన్నికల విధులు విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు.
News February 19, 2025
సిద్దిపేట: ప్రియుడితో కలిసి భర్త హత్యకు యత్నం

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య యత్నించింది. పోలీసుల వివరాలిలా.. సిద్దిపేటలోని గుండ్లచెరువు కాలనీ వాసికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్యకు అదే కాలనీకి చెందిన శ్రవణ్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డుగా ఉన్న భర్త హత్యకు ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ చేసింది. శ్రవణ్ తన స్నేహితులతో కలిసి 2సార్లు దాడి చేయగా భర్త ఇచ్చిన ఫిర్యాదుతో విచారించిన పోలీసులు శ్రవణ్‌ను రిమాండ్‌కు తరలించారు.
News February 19, 2025
నేడు బీఆర్ఎస్ సమావేశం.. హాజరుకానున్న కేసీఆర్

హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం సందడి వాతావరణం నెలకొననుంది. మధ్నాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం KCR అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. నగరంతో పాటు అన్ని జిల్లాల ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్నారు. కారులన్నీ తెలంగాణ భవన్‌కు క్యూ కట్టాయి. భవిష్యత్తు కార్యాచరణపై HYD వేదికగా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.