News January 4, 2025
విద్యార్థులు రాణించాలంటే భాషా నైపుణ్యం కీలకం

విద్యార్థులు ప్రపంచ వేదికపై రాణించాలంటే భాషా నైపుణ్యం అత్యంత కీలకమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ (ఈఎల్ సీ) ద్వారా గిరిజన విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణను గవర్నర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 66 మంది యూజీ చదువుతున్న గిరిజన విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ అందించనున్నారు.
Similar News
News December 1, 2025
HYD మెట్రోలో ట్రాన్స్జెండర్లకి ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ శాఖలోనే కాకుండా మెట్రో రైల్లో సైతం ట్రాన్స్జెండర్లకి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల సుమారు 20 మందిని ఎంపిక చేసిన మెట్రో అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. నేటి నుంచి ట్రాన్స్జెండర్లు వారికి కేటాయించిన మెట్రో స్టేషన్లలో సేవలు అందిస్తున్నారు. రైళ్ల రాకపోకల వివరాలతో పాటు, మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో ప్రముఖ పాత్ర వహించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
News December 1, 2025
పాతబస్తీలో అండర్గ్రౌండ్ సర్జరీ!

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.
News December 1, 2025
హైదరాబాద్ శివారు రోడ్లకు మహర్దశ

HYD శివారు రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం రూ.390కోట్ల భారీ ప్రాజెక్టును ప్రకటించింది. 148.85 కి.మీ. మేర రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దడానికి టెండర్లు పిలిచింది. HAM పద్ధతిలో ప్రాజెక్టును చేపడుతున్నారు. దీని ప్రకారం, ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో కొంత భాగాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుంది. ఈప్రాజెక్టును (PPP) ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాంతో చేపట్టనున్నట్లు అధికారులు Way2Newsకు తెలిపారు.


