News February 14, 2025

విద్యార్థులు సమాజంలో ఆదర్శంగా నిలవాలి: కడప ఎస్పీ

image

విద్యార్థులు ఉత్తమ చదువులతో అత్యున్నత స్థానాలకు చేరుకొని సమాజంలో ఆదర్శంగా నిలవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు గురువారం ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని, సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలిచి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

Similar News

News February 20, 2025

కడప జిల్లాలో పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు 

image

త్వరలో జరగబోయే ఇంటర్మీడియట్‌ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్ల చేసినట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. అమరావతి నుంచి సీస్ విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఇంటర్ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

News February 20, 2025

కడప: పకడ్బందీగా గ్రూప్-2 మెయిన్ పరీక్షలు

image

ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్ పరీక్షలు  పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై లైజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.

News February 20, 2025

కడప: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

image

తిరుపతి రూరల్ మండలం, రామానుజపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఒకరు కడప జిల్లా, బురిడపల్లి గ్రామానికి చెందిన సాహిర్ బాషా కాగా, మరో యువతి పీలేరు, రామానాయక్ తాండాకు చెందిన బుక్కే యమునాగా పోలీసులు గుర్తించారు. యమునా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం పుత్తూరుకి వెళ్లి వస్తుండగా రాంగ్ రూట్లో వచ్చి టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

error: Content is protected !!