News March 20, 2025
విద్యార్థులూ.. ఆల్ ది బెస్ట్: కలెక్టర్

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుంచి ఏప్రిల్ 4వ తేది వరకు.. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్షలు మొదలవుతాయి. ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని పదో తరగతి విద్యార్థులందరూ ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. విద్యార్థులందరికీ ALL THE BEST చెప్పారు.
Similar News
News October 29, 2025
విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారేమోనని ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకెళ్లాడు

బకాయిల కోసం కరెంట్ కనెక్షన్ను కట్ చేస్తారేమోనని ఏకంగా ప్రభుత్వ ట్రాన్స్ఫార్మర్ను తీసుకుపోయాడో వ్యక్తి. మధ్యప్రదేశ్లోని భిండి జిల్లాలో ఇది జరిగింది. నిందితుడు శ్రీరామ్ బిహారీ త్రిపాఠి ₹1,49,795 బకాయి పడ్డాడు. సిబ్బంది ఇంటి కనెక్షన్తో పాటు అక్కడి 25KV ట్రాన్స్ఫార్మర్నూ తీసేస్తారని భావించాడు. దీంతో దాన్నితొలగించి ఇంటికి తీసుకుపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
News October 29, 2025
జిల్లాలో 1,937 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు: మంత్రి నాదెండ్ల

ఏలూరు జిల్లాలో 54 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి, తుఫాను బాధితులైన 1,937 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతీ కేంద్రంలో భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 148 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, 318 మంది గర్భిణులను పీహెచ్సీల్లోకి తరలించామని ఆయన మంగళవారం రాత్రి పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
News October 29, 2025
MBNR: బస్సు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

పెబ్బేరు బస్టాండ్లో జరిగిన దుర్ఘటనలో మహిళ మృతి చెందింది. ASI శ్రీనివాస్ కథనం.. NRPT చెందిన కె.అంజమ్మ ఆదివారం గద్వాల నుంచి HYD వెళ్లే బస్సులో ప్రయాణించి పెబ్బేరు వద్ద దిగారు. బస్సు వెనుకన నడుస్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా బస్సు స్టార్ట్ చేయడంతో ఆమె వెనుక టైరు కిందపడి కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది. ఈ ఘటనపై కూతురు ఫిర్యాదుతో కేసు నమోదైంది.


