News March 26, 2025
‘విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు కృషిచేయాలి’

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ సిటీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా కృషి చేయాలని చెప్పారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సమావేశంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
మొక్కలకు బోరాన్ ఎందుకు అవసరం?

బోరాన్ అనే ఈ సూక్ష్మధాతు మూలకం బోరిక్ యాసిడ్ స్థితిలో మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. ఇది మొక్కల్లో, నేలల్లో నిశ్చల స్థితిలో ఉంటుంది. మొక్క ఆకులలో తయారయ్యే ఆహారాన్ని అన్ని భాగాలకు చేరవేయడంలో బోరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల సంపర్క ప్రక్రియలో ఉపయోగపడే పుప్పొడి ఉత్పత్తిలో, పుప్పొడి కణాల ఎదుగుదలను నియంత్రిస్తూ విత్తన, పండ్ల ఎదుగుదలను నిలువరిస్తుంది. మొక్క కాల్షియం గ్రహించడానికి తోత్పడుతుంది.
News November 21, 2025
మొక్కల్లో బోరాన్ లోపిస్తే ఏం జరుగుతుంది?

బోరాన్ లోపం వల్ల మొక్కలో పెరిగే భాగాలైన వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు, లేత పత్రాలపై ప్రభావం పడుతుంది. ఈ లోపానికి సరైన మొక్కల్లో చిగుర్లు వికృతాకారంలో ఉంటాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపు మీద ఉంటాయి. దీని వల్ల మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుంచి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు చారలుగా మారతాయి. తర్వాత ముడుచుకుపోతాయి.
News November 21, 2025
BREAKING: ములుగు ఎస్పీ శబరీష్ బదిలీ.. కొత్త ఎస్పీగా సుధీర్

ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గతంలో ములుగు అడిషనల్ ఎస్పీగా పని చేసిన సుధీర్ రాంనాథ్ కేకన్ను జిల్లా ఎస్పీగా కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ములుగులో పనిచేసిన అనుభవం నేపథ్యంలో ఆయనను ములుగు జిల్లాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది.


