News January 28, 2025
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: ASF కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ మండలంలోని గోడవెల్లి మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, సరుకుల నిల్వలు,రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య బోధన అందించాలని సూచించారు.
Similar News
News December 16, 2025
నాగర్ కర్నూల్‌లో స్వల్పంగా పెరిగిన చలి తీవ్రత

నాగర్ కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే ఈ రోజు చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా కల్వకుర్తి మండలంలో 11.1C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్, బల్మూర్, వెల్దండ, లింగాల, తాడూరు, అచ్చంపేట మండలాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
News December 16, 2025
GNT: నిలకడగా స్క్రబ్ టైఫస్ రోగుల ఆరోగ్య పరిస్థితి

గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్ టైఫస్ జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బుధవారం జీజీహెచ్‌కు వచ్చిన 13 మంది జ్వర బాధితుల నమూనాలను పరీక్షించగా, మంగళగిరి, అమృతలూరుకు చెందిన ఇద్దరికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఇద్దరిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
News December 16, 2025
ఖమ్మం: పంచాయతీ పోరులో ‘నోటు’ స్వామ్యం

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అభివృద్ధి హామీల కంటే డబ్బు, మద్యం, తాయిలాల పంపిణీకే ప్రాధాన్యం ఇవ్వడంతో పల్లె ఎన్నికలు ‘నోటుస్వామ్యం’లా మారాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.10 వేలు, మాంసం పంపిణీ చేశారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ రహిత ఎన్నికల్లో జిల్లా నాయకుల ప్రచారం చర్చనీయాంశమైంది.


