News January 28, 2025
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: ASF కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ మండలంలోని గోడవెల్లి మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, సరుకుల నిల్వలు,రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య బోధన అందించాలని సూచించారు.
Similar News
News February 12, 2025
త్వరలో రాజ్యసభకు కమల్ హాసన్!

మక్కల్ నీది మయ్యమ్ (MNM) అధినేత, సినీ స్టార్ కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఆయనతో పాటు మరొకరికీ అవకాశం ఉంటుందని తెలిసింది. 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు అధికార DMKతో MNM పొత్తు పెట్టుకుంది. బదులుగా కమల్‌ను రాజ్యసభకు పంపిస్తామని CM MK స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని నేడు DMK మంత్రి ఒకరు, అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. MNM నుంచి మరొకరికీ అవకాశమిస్తామని పేర్కొన్నారు.
News February 12, 2025
HYD: కోర్ వైపు కష్టమే.. అంతా కంప్యూటర్ వైపే..!

HYD, RR, MDCL కాలేజీల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్ తదితర కోర్ బ్రాంచీల్లో ఇంజినీరింగ్ సీట్లు భారీగా పడిపోతున్నాయి. విద్యార్థుల ఆలోచనను పసిగట్టి, కోర్ బ్రాంచీలు తీసేసి కంప్యూటర్ కోర్సుల వైపు కాలేజీలు మొగ్గు చూపుతున్నాయి.వచ్చే ఏడాదికి తమకు AI, కంప్యూటర్ సైన్స్ (CSE)లాంటి కోర్సులు నడిపేందుకు పర్మిషన్ కావాలని సుమారు 15కు పైగా కాలేజీలు దరఖాస్తులు పెట్టుకున్నాయి.
News February 12, 2025
HYD వితౌట్ ఇంటర్నెట్..! మీ కామెంట్

HYDలో ఒక్కసారి ఇంటర్ నెట్ ఆగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతం పెరిగిన డిజిటలైజేషన్ మేరకు దేశ, విదేశాల నుంచి వచ్చి HYD కేంద్రంగా చేస్తున్న ప్రతి ఉద్యోగానికి ఇంటర్నెట్ ముడిపడి ఉంది. అసలు ఇంటర్నెట్ లేనిదే పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఊహించండి HYD వితౌట్ ఇంటర్నెట్ అంటూ..Xలో పలువురు వేలాది పోస్టులు చేస్తున్నారు. అది అసాధ్యం అని కొందరు, బతకలేం అని ఇంకొందరు అంటున్నారు.