News August 25, 2024

విద్యార్థుల నడవడికను గమనించాలి: వరంగల్ సీపీ

image

వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల నడవడికను యాజమాన్యాలు గమనిస్తూ ఉండాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. కమిషనరేట్‌లోని డిగ్రీ, జూనియర్ కళాశాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో గంజాయిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ కోరారు. కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Similar News

News January 15, 2025

గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా

image

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సమర్థవంతంగా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఈరోజు ఉదయం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లతో ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి సూచించారు.

News January 15, 2025

ఐనవోలు జాతరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన MLA

image

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఐనవోలు పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

News January 15, 2025

వరంగల్: పండుగ పూట విషాదం.. గుండెపోటుతో మహిళ మృతి

image

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హాన్‌పల్లి గ్రామంలో పండుగ రోజు విషాదం నెలకొంది. కుటుంబీకుల వివరాలు.. గ్రామానికి చెందిన మౌనిక(30) గుండె పోటుతో మంగళవారం మృతి చెందింది. ఈ ఆకస్మిక ఘటనతో పండుగవేళ కుటుంబంలో, గ్రామంలో విషాదం నెలకొంది. మౌనిక మృతి పట్ల పలువురు గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.