News January 23, 2025

విద్యార్థుల సహాయ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

గురుకులాల్లోని సీట్ల ప్రవేశానికి విద్యార్థుల సహాయార్థం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పర్యవేక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థుల‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంటుంద‌ని, ఇక్క‌డ విద్య‌ను పొందితే ఉన్న‌తంగా రాణించే అవ‌కాశం ఉంటుందని తెలిపారు.

Similar News

News February 20, 2025

సంగారెడ్డి: ప్రొఫెసర్ సూసైడ్

image

మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామ శివారులో గల వాక్సిన్ యూనివర్సిటీలో డిజైనర్ ప్రొఫెసర్ సుమంత్ కుమార్ (36) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 20, 2025

సిద్దిపేట: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్

image

అత్యవసర సమయంలో ఒకరికి రక్త దానం చేసి మానవత్వాన్ని ఓ కానిస్టేబుల్ చాటాడు. సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో ” O ” పాజిటివ్ బ్లడ్ అవసరమైంది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ శేఖర్ వెంటనే మిత్ర బ్లడ్ బ్యాంక్ వెళ్లి రక్తదానం చేశాడు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తి కుటుంబ సభ్యులు కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News February 20, 2025

గర్భాలు నిలబడటం లేదు!

image

వెనకటి తరాల వారు పదిమంది పిల్లల్ని కనేవారు. కానీ నేడు గర్భం దాల్చడమే గగనమవుతోంది. మరికొంతమందిలో గర్భాన్ని నిలబెట్టుకోవడం సమస్య అవుతోంది. రెండు మెట్లెక్కితే చాలు గర్భస్రావం అయిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారిన జీవనశైలి, స్త్రీపురుషులిద్దరిలోనూ తగినంత దృఢత్వం లేకపోవడం, ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు.

error: Content is protected !!