News July 3, 2024

విద్యార్థుల హాజ‌రుపై ప్ర‌త్యేక దృష్టి: క‌లెక్ట‌ర్ సృజ‌న

image

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డీఈఓ సుబ్బారావుతో కలిసి బుధ‌వారం జిల్లా విద్యాశాఖ కార్య‌క‌లాపాల‌పై కలెక్టర్ సృజన స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాలోని వివిధ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు ప్ర‌వేశాలు, బోధ‌నా సిబ్బంది, మౌలిక వ‌స‌తులు, ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల హాజ‌రుపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.

Similar News

News September 15, 2025

కృష్ణా: 13 మంది ఎంపీడీఓలకు పదోన్నతి

image

కృష్ణా జిల్లాలో నలుగురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, 9 మంది డిప్యూటీ ఎంపీడీఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన వారికి జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కన్నమ నాయుడు పాల్గొన్నారు.

News September 15, 2025

కృష్ణా: నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూతన SP

image

కృష్ణా జిల్లా ఎస్పీగా నియమితులైన విద్యాసాగర్ నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఆయన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు చేపడతారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడును కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

News September 15, 2025

MTM: ఎస్పీ గంగాధరరావుకు ఘన వీడ్కోలు

image

కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్తున్న ఆర్. గంగాధరరావు ఐపీఎస్‌కు పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. మచిలీపట్నం గోల్డ్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్పీతో తమ అనుభవాలను పంచుకున్నారు. తమకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి గంగాధరరావు కృతజ్ఞతలు తెలిపారు.