News February 4, 2026

విద్యా పరిపాలనపై శిక్షణ.. గుజరాత్‌కు ఖమ్మం డీఈఓ!

image

ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) చైతన్య జైనీ వృత్తిపరమైన శిక్షణ కోసం గుజరాత్ వెళ్లారు. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు విద్యా నిర్వహణ, ఆధునిక విధానాలపై జరిగే ప్రత్యేక తరగతుల్లో ఆమె పాల్గొంటారు. ఆమె గైర్హాజరీలో డీఈఓ కార్యాలయ ఏడీ చావా శ్రీనివాసరావు ఇన్‌ఛార్జ్ డీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారని అధికారులు తెలిపారు. విద్యా రంగంలో సంస్కరణలే లక్ష్యంగా ఈ శిక్షణ సాగనుంది.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.