News June 12, 2024
విద్యా, వైద్యానికే మొదటి ప్రాధాన్యత: డిప్యూటీ సీఎం

ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.
Similar News
News December 1, 2025
మార్చి 2026 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి: తుమ్మల

మార్చి 2026 నాటికి ఖమ్మం మున్నేరు రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నగర్ మేయర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో తుమ్మల సమీక్షించారు. ప్రతి నెల ఎంత మేరకు పనులు పూర్తవుతాయో నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని పేర్కొన్నారు.
News December 1, 2025
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు: పోలీస్ కమిషనర్

గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. అర్ధరాత్రి సమయాల్లో అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌ను పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు నియంత్రణలో ఉంటాయని, గస్తీ, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తున్నారని ఆయన తెలిపారు.
News December 1, 2025
ఖమ్మంలో ఎన్నికల వేడి.. ప్రత్యర్థులను తప్పించే ప్రయత్నాలు!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తొలి విడత నామినేషన్లు పూర్తి కావడం, రెండో విడత ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. తమ గెలుపుపై ప్రభావం చూపుతారని భావించిన కొందరు అభ్యర్థులు, డబ్బు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాల్లో శరవేగంగా నిమగ్నమయ్యారు.


