News March 4, 2025
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు: వరుణ్ రెడ్డి

హన్మకొండలోని NPDCL కార్యాలయంలో 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి , ఏప్రిల్ నెలలు పరీక్షల సమయం కావున విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓవర్ లోడ్ పెరిగే అవకాశం ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్లు సామర్థ్యం పెంపుదల చేయాలని తెలిపారు.
Similar News
News March 4, 2025
నేడు ప్రపంచ ఊబకాయ దినోత్సవం

మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన మహమ్మారి ఊబకాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ 2015 నుంచి మార్చి 4ను ఊబకాయ అవగాహనా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు జనం ఊబకాయంతో బాధపడుతున్నట్లు అంచనా. మధుమేహం, గుండె జబ్బులు, బీపీ, లివర్, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్, ఎముకల అనారోగ్యాలకు ఊబకాయం కారణమవుతోంది.
News March 4, 2025
ఇల్లంతకుంట: టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి మృతి

టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి నుజ్జు నుజ్జైన ఘటన ఇల్లంతకుంట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… అనంతారంలో బైక్ పై వెళుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీ కొట్టి అతడి పైనుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 4, 2025
టీమ్ ఇండియా ఆందోళనంతా అతడి గురించే: DK

టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా జట్టుతో భయం లేదు కానీ మానసికంగా ట్రావిస్ హెడ్ అనే అడ్డంకి ఆటగాళ్ల మైండ్‌లో ఉంటుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అంచనా వేశారు. ‘గతంలో నాకౌట్ గేమ్స్‌లో న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు ఇలాంటి భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడుతోంది. హెడ్ వికెట్ తీస్తే భారత్ ఊపిరి పీల్చుకోవచ్చు’ అని DK పేర్కొన్నారు.