News March 4, 2025
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు: వరుణ్ రెడ్డి

హన్మకొండలోని NPDCL కార్యాలయంలో 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి , ఏప్రిల్ నెలలు పరీక్షల సమయం కావున విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓవర్ లోడ్ పెరిగే అవకాశం ఉన్న చోట ట్రాన్స్‌ఫార్మర్లు సామర్థ్యం పెంపుదల చేయాలని తెలిపారు.
Similar News
News March 24, 2025
భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం సోమవారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి, భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబంది, భక్తులు ఉన్నారు.
News March 24, 2025
ఎన్టీఆర్: అమరావతిలో సిద్ధమవుతున్న బేస్ క్యాంపులు

రాజధాని అమరావతి పనులు ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు గుత్తేదారు సంస్థలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవల విజయవాడలోని CRDA కార్యాలయంలో రూ.22,607.11కోట్ల పనులకు సంబంధించి లెటర్ ఆయా యాక్సెప్టెన్స్(LOA)ను గుత్తేదారులకు అందజేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు ప్రారంభం కాగానే ఆయా సంస్థలు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
News March 24, 2025
ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు

TG: 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లకు 5 చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నాటికి వీటిని స్కూళ్లలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈనెల 15 నుంచి ప్రయోగాత్మకంగా 513 స్కూళ్లలో AI టూల్స్‌ను వినియోగిస్తూ ఇంగ్లిష్, మ్యాథ్స్ పాఠాలను బోధిస్తున్నారు. 25-26 విద్యా సంవత్సరంలో మరిన్ని స్కూళ్లలో దీనిని అమలు చేయనున్నారు.