News January 15, 2025

విద్యుత్ కాంతులతో కొత్తకొండ వీరన్న ఆలయం

image

ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం విద్యుత్ కాంతులతో సుందర దృశ్యంగా కనిపిస్తోంది. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.

Similar News

News November 4, 2025

వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

News November 4, 2025

ఇంటర్ బోర్డు ఆదేశాలు తప్పనిసరి: డీఐఈఓ

image

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. ఆయన మంగళవారం పర్వతగిరి, నెక్కొండ కళాశాలలను సందర్శించి అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, మానసిక వికాసానికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.

News November 4, 2025

నేషనల్ హైవే భూసేకరణపై సమీక్ష

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే (ఎన్‌హెచ్ 163జీ) పనులకు సంబంధించి భూసేకరణ పురోగతిపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సమీక్షించారు. మంచిర్యాల–వరంగల్–ఖమ్మం జిల్లాల మీదుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 176.52 హెక్టార్లకు గాను 171.34 హెక్టార్ల భూసేకరణ పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన పెండింగ్ అవార్డులను నవంబర్ 10 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.