News December 3, 2024
విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న HNK NPDCL కార్యాలయం
హనుమకొండలోని NPDCL కార్యాలయాన్ని సోమవారం విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా ఈనెల 1 నుంచి 9 వరకు జరిగే ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించామని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో విద్యుత్ కాంతులు అటుగా వెళ్లే వాహనదారులను ఆకర్షించాయి.
Similar News
News December 27, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> BHPL: కాటారం మండలంలో వ్యక్తి దారుణ హత్య
> WGL: బైక్ అదుపుతప్పి యువకుడికి గాయాలు
> NSPT: రోడ్డు ప్రమాదంలో B.TECH యువకుడి మృతి.. UPDATE
> WGL: వర్ధన్నపేటలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
> JN: ఫీట్ లోతులో గుంత.. ప్రమాదకరంగా ప్రయాణం!
> WGL: ఉరి వేసుకుని యువకుడు సూసైడ్
> HNK: రౌడీ షీటర్లను ఉక్కు పాదంతో అణిచివేయాలి
News December 27, 2024
నల్లబెల్లి: అడుగులే పులుల సంచారాన్ని బయటపెట్టాయి!
పులుల అడుగుల సైజులతోనే మండలంలో మూడు పులులు సంచరిస్తున్నట్టు అధికారులు నిర్ధారించారు. సాధారణంగా మగ పులి అడుగు పెద్దగా, ఆడపులి అడుగు కొద్దిగా చిన్నగా ఉంటుందని అధికారులు తెలిపారు. రుద్రగూడెంలో పులి అడుగు సైజు 15 నుంచి 20 సెం.మీ కాగా కొండాపురంలో పులి అడుగు 12 నుంచి 15 సెం.మీ, పులి పిల్ల అడుగు 6 నుంచి 8 సెం.మీ ఉండడంతో మండలంలో ఒకటి కాదు మూడు పులుల సంచారం బయటపడింది.
News December 27, 2024
WGL: రేపటి నుంచి మూడు రోజులు వరుస సెలవులు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ను మూసి వేస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మూడు రోజులు సరకులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.