News September 22, 2024

విద్యుత్ తీగ తెగి మీద పడి రైతు మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందిన ఘటన ఆత్మకూర్ (ఎస్) కందగట్లలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు మంచాల సైదులు తన పొలంలో విద్యుత్‌మోటార్ అమర్చడానికి నియంత్రిక వద్దకు వెళ్లగా విద్యుత్ తీగ తెగి మీద పడింది. దీంతో కరెంట్ షాక్‌కు గురైయ్యాడు. స్థానికుల ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదులు తెలిపారు.

Similar News

News October 5, 2024

NLG: బీఈడీ ఫలితాలు విడుదల

image

MG యూనివర్సిటీ పరిధిలో బీఈడీ సెమిస్టర్ ఫలితాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ లక్ష్మీప్రభ శుక్రవారం విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్‌లో 92.6 శాతం, మూడో సెమిస్టర్లో 79.30 శాతం, రెండో సెమిస్టర్లో 84.96 శాతం, మొదటి సెమిస్టర్లో 77.7 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News October 5, 2024

యాదాద్రి: భార్యను హత్య చేసిన భర్త

image

మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన అడ్డగూడూరు మండలం డి.రేపాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోనుగ స్వరూప, కృష్ణారెడ్డి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కృష్ణారెడ్డి తాగి వచ్చి భార్య స్వరూపతో గొడవపడి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించబోయి దొరికిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 5, 2024

నేటి నుంచి నల్గొండలో చేనేత హస్తకళా మేళా

image

నల్గొండ బోయవాడలో గల ఎస్బీఆర్ గార్డెన్స్‌లో ఈ నెల 5 నుంచి 27 వరకు కళాభారతి చేనేత హస్తకళ మేళా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జెల్లా సత్యనారాయణ తెలిపారు. ఇందులో అఖిలభారత హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలంతా ఈ ప్రదర్శనను తిలకించి చేనేతను ఆదరించాలని కోరారు. చేనేత కళాకారులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వస్త్రాలను అమ్మడం జరుగుతుందని తెలిపారు.