News January 26, 2025

విద్యుత్ దీపాల వెలుగులలో BHPL ఐడీఓసీ కార్యాలయం

image

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయాన్ని విద్యుత్ దీపాల వెలుగులతో అలంకరించారు. కాగా, గణతంత్ర దినోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని డా.బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.

Similar News

News December 10, 2025

అవినీతి రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ పమేలా సత్పతి

image

అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అవినీతి వ్యతిరేక దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అవినీతి రహిత సమాజం మనందరి లక్ష్యం కావాలని ఆమె పేర్కొన్నారు.

News December 10, 2025

విశాఖ: DRO, RDOల నియామ‌కంలో మీన‌మేషాలు

image

విశాఖలో రెగ్యులర్ అధికారుల‌ను నియ‌మించ‌డంలో ప్ర‌భుత్వం మీన‌మేషాలు లెక్కిస్తోంది. DRO, RDOల మ‌ధ్య వివాదం జరగ్గా.. ఇద్ద‌రినీ స‌రెండ‌ర్ చేశారు. 2 నెల‌లు కావొస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు రెగ్యుల‌ర్ అధికారుల‌ను నియ‌మించ‌లేదు. ఇన్‌ఛార్జ్ హోదాల్లో ఉన్నవారు పెద్ద‌ పెద్ద ప‌నుల విష‌యంలో త‌ల‌దూర్చడం లేదు. తాత్కాలిక‌మైన ప‌నుల‌నే చూసుకొని వెళ్లిపోతున్నారు. దీంతో కీల‌క‌ నిర్ణ‌యాల విష‌యంలో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి.

News December 10, 2025

తిరుపతి ఐజర్‌లో ఉద్యోగావకాశం

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి ఐజర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా లేబరోటరీ అసిస్టెంట్-1 పోస్టుకు 13వ తేదీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్/ డిప్లమా ఇన్ M.L.T పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు www.iisertirupati.ac.in/jobs/advt_762025/ వెబ్ సైట్ చూడాలి.