News January 26, 2025

విద్యుత్ దీపాల వెలుగులలో BHPL ఐడీఓసీ కార్యాలయం

image

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయాన్ని విద్యుత్ దీపాల వెలుగులతో అలంకరించారు. కాగా, గణతంత్ర దినోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని డా.బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.

Similar News

News February 9, 2025

విశాఖ: సముద్రంలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

image

విశాఖకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్ర తీరంలో ఆదివారం మృతిచెందారు. మృతులు కంచరపాలేనికి చెందిన మొక్క సూర్యతేజ, దువ్వాడకు చెందిన మొక్క పవన్‌గా గుర్తించారు. రాంబిల్లి బీచ్‌లో స్నానం చేయడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 9, 2025

సిద్ధేశ్వరుడికి ప్రత్యేక అన్నాభిషేకం

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో మాఘ మాసం ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సిద్ధేశ్వరుడికి ప్రత్యేక అన్నాభిషేకం, అలంకరణ నిర్వహించారు. అన్నాభిషేకం అనంతరం సిద్ధేశ్వర ఆలయాన్ని భక్తులు సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సిద్ధేశ్వరాలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు ఏర్పాటు చేశారు.

News February 9, 2025

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌కు ఆదేశం

image

AP: తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్‌పై <<15400758>>ఆరోపణలు వస్తున్న<<>> వేళ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఆరోపణలపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌ను ఆదేశించింది. జనసైనికులు, వీర మహిళలు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని, సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

error: Content is protected !!