News March 31, 2025
విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు: సీఎండీ

NPDCL పరిధిలోని 16 సర్కిళ్లలో విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడానికి “కన్స్యూమర్ ఫీడ్ బ్యాక్ సెల్”ను కొత్తగా ఏర్పాటు చేశామని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. మార్చిలో వివిధ క్యాటగిరీలో రిలీజ్ చేసిన కొత్త సర్వీసుల్లో రోజుకు దాదాపు 60 మంది వినియోగదారులకు ఫోన్ చేసి 4 పారామీటర్ల ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని చెప్పారు.
Similar News
News April 4, 2025
IPL: అట్టడుగుకు పడిపోయిన SRH

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగు స్థానానికి పడిపోయింది. టేబుల్ టాపర్‌గా పంజాబ్ కింగ్స్ కొనసాగుతోంది. 5 జట్లు 4 పాయింట్లతో, మరో 5 జట్లు 2 పాయింట్లతో నిలిచాయి. పాయింట్స్ టేబుల్‌లో PBKS తర్వాత DC, RCB, GT, KKR, MI, LSG, CSK, RR, SRH ఉన్నాయి.
News April 4, 2025
నాగర్‌కర్నూల్: పెద్దపులి దాడి.. యజమానులకు నష్టపరిహారం

NGKL జిల్లా అచ్చంపేట ప్రాంతంలో రెండు నెలల క్రితం పెద్దపులి దాడిలో మృతిచెందిన పశువుల యజమానులకు అటవీ శాఖ నష్టపరిహారం అందజేసింది. బక్క లింగాయపల్లి, దండాలం గ్రామాలకు చెందిన హరి, వెంకట్రామ్, రాకేశ్‌కు వరుసగా రూ.15,000, రూ.15,000, రూ.12,000 చొప్పున చెక్కులను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుబూర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేంద్ర, అధికారులు బాలరాజు, జ్యోతి, రజిత తదితరులు ఉన్నారు.
News April 4, 2025
SKZR: ఇద్దరి బైండోవర్.. రూ.2లక్షల జరిమానా

కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన యెనాం రాజు దేశీదారు అమ్ముతూ, ఈస్గం గ్రామానికి చెందిన సాయిరి రమేష్ బెల్లం రవాణ చేస్తూ పట్టుబడ్డారు. వారిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి కాగజ్‌నగర్ తహశీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. కానీ మళ్లీ వారు దేశీదారు, బెల్లము అమ్ముతూ పట్టుబడగా కాగజ్‌నగర్ తహశీల్దార్ కిరణ్ ఆ ఇద్దరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ రవికుమార్ తెలిపారు.