News August 13, 2024
విద్యుత్ వెలుగులతో ఆకట్టుకుంటున్న కొండారెడ్డి బురుజు
కర్నూలు నగరం ఆగస్టు 15న జరిగే 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా అధికారులు కొండారెడ్డి బురుజును త్రివర్ణ పతాక విద్యుత్ వెలుగులతో సిద్ధం చేశారు. ఈ దృశ్యాన్ని చూడటానికి నగర ప్రజలు తరలి వస్తున్నారు.
Similar News
News September 10, 2024
నంద్యాలలో 10న దిశా కమిటీ సమావేశం
ఈ నెల 10వ తేదీ దిశా కమిటీ (కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులు, అభివృద్ధిపై సమీక్ష) సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, కన్వీనర్ జి.రాజకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్లో సోమవారం ఉ.10 గంటలకు ఎంపీ బైరెడ్డి శబరి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. జిల్లా మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర పర్సన్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొంటారని తెలిపారు.
News September 9, 2024
శ్రీశైలం: గణపయ్యకు 130 రకాల ప్రసాదాలు నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆయా గణేశ్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన అలంకారం మండపంలో కొలువుతీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. కొత్త బజార్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బొజ్జా గణపయ్యకు 130 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.
News September 9, 2024
ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోంది: మంత్రి ఫరూక్
ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోందని నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఫరూక్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలకు పెంచడం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, పోలవరం నిర్మాణం, పకృతి విపత్తుల సమర్ధ నిర్వహణపై దృష్టి సారించామని అన్నారు.