News August 9, 2024

విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు చేపడతాం: డిప్యూటీ సీఎం

image

విద్యుత్ శాఖ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు చేపడతామని ప్రకటించారు. విద్యుత్ శాఖలో 7-8 ఏళ్లుగా ప్రమోషన్లు లేవని దీని వల్ల చాలా మంది ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.

Similar News

News December 18, 2025

ఖమ్మం: మూడో దశ పోరులో పైచేయి ఎవరిదంటే?

image

● సత్తుపల్లి(21 స్థానాలు): CON- 16, BRS- 4, TDP- 1
● ఏన్కూర్(20): CON- 16, BRS- 3, ఇతరులు- 1
● తల్లాడ(27): CON- 19, BRS- 6, CPM- 1, ఇతరులు- 1
● కల్లూరు(23): CON- 8, BRS- 11, ఇతరులు- 4
● సింగరేణి(41): CON- 32, BRS- 2, CPI- 1, ఇతరులు- 6
● పెనుబల్లి(32): CON- 23, BRS- 8, ఇతరులు- 1
● వేంసూరు(26): CON- 15, BRS- 10, CPM- 1.

News December 17, 2025

జైత్రం తండా సర్పంచ్‌గా జయంతి

image

సింగరేణి మండలంలోని జైత్రం తండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి మూడ్‌ జయంతి విజయకేతనం ఎగురవేశారు. బుధవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన మెజారిటీతో ఘనవిజయం సాధించి సర్పంచ్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. జయంతి విజయం సాధించడంతో తండాలో గులాబీ శ్రేణులు బాణసంచా కాల్చి, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

News December 17, 2025

ఖమ్మం: తుది దశలో మొదటి సర్పంచిగా విజయం

image

కల్లూరు మండలంలో బుధవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తెలగారం గ్రామానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి యల్లమందల విజయలక్ష్మి విజయం సాధించారు. 49 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఆమె అనుచరులు స్థానికులు విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని, తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సూర్యకాంత ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.