News September 4, 2024

విద్యుత్ శాఖ ఇబ్బంది పెట్టొద్దు: కేంద్ర మంత్రి

image

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, కరీంనగర్ పట్టణంలో గణేశ్ మండపాలకు అయ్యే ఖర్చు అంతా తానే చెల్లించనున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. వినాయక మండప నిర్వాహకులను విద్యుత్ శాఖ ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకుందామని పిలుపునిచ్చారు.

Similar News

News July 6, 2025

కరీంనగర్ డీఈఓకు ఎస్జీటీయూ వినతి

image

DEO శ్రీరామ్ మొండయ్యకు ఈరోజు SGTU జిల్లా శాఖ పక్షాన పలు విద్యా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. త్వరలో జరగనున్న సర్దుబాటు ప్రక్రియలో SGT ఉపాధ్యాయులను PS, UPS లకే కేటాయించాలని, హై స్కూల్స్‌కు కేటాయించవద్దని కోరారు. మల్కాపూర్ PSలో తీవ్ర టీచర్ల కోరత ఉందన్నారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని, బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

News July 6, 2025

వీణవంక: గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారులకు కేంద్రమంత్రి సన్మానం

image

వీణవంక మండలానికి చెందిన బత్తిని నరేష్ కుమార్తె బత్తిని సహశ్రీ, వేముల సరివిక, కాసర్ల లాస్య గతేడాది హైదరాబాద్‌లో ప్రదర్శించిన కూచిపూడి నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. వారిని శనివారం కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్కరించారు. గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని, మెడల్‌ను అందజేశారు. చిన్నారులను ప్రశంసించారు.

News July 5, 2025

చొప్పదండి: తైక్వాండో ఛాంపియన్లను అభినందించిన కేంద్రమంత్రి

image

చొప్పదండి పట్టణానికి చెందిన తైక్వాండో ఛాంపియన్లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం అభినందించారు. జూన్ 23 నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. పడకంటి కాశీ విశ్వనాద్, భూసారపు వెంకటేష్ గౌడ్, స్పందన, సౌమ్య, రామ్ చరణ్ అనే విద్యార్థులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఏడు గోల్డ్, ఒకటి సిల్వర్, ఒకటి రజిత పథకాలు సాధించారు.