News September 1, 2024
విద్యుత్ శాఖ కంట్రోల్ రూంలు ఏర్పాటు
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని ఏడు డివిజన్లలో, విద్యుత్ భవన్ లో విద్యుత్ శాఖ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి ఆదిశేషయ్య తెలిపారు. నాయుడుపేట: 7382623177, గూడూరు:701036852, నెల్లూరు రూరల్:9381815083, నెల్లూరు టౌన్:7901642857, కోవూరు:8328082583, కావలి:7901056437, ఆత్మకూరు: 7901056906
Similar News
News September 11, 2024
నెల్లూరు: 2 రోజుల్లో.. 3 హత్యలు
రెండు రోజుల వ్యవధిలోనే మూడు హత్యలు జరగడం పట్ల గూడూరు ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే రెండు హత్యలు జరగా బుధవారం మరో హత్య గూడూరు ప్రాంతంలో కలకలం రేపింది. చిల్లకూరు మండలం తణుకుమాల గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి పూడ్చిపెట్టగా.. సైదాపురం మండలం గంగదేవిపల్లి గ్రామంలో భార్యను అనుమానంతో భర్త కడతేర్చాడు. బుధవారం గూడూరు శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
News September 11, 2024
నెల్లూరు: నిప్పో ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం
తడ మండలంలోని నిప్పో ఫ్యాక్టరీ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనగా విష్ణు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడగా హాస్పిటల్ కి తరలించారు. తడ ఎస్సై కొండప్ప నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 11, 2024
గూడూరులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం
గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లమ్మ గుడి రైల్వే ట్రాక్ సమీపంలో సుమారు 23 నుంచి 25 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గూడూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు, యువకుడు పడి ఉన్న తీరును గాయాలను బట్టి ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.