News March 13, 2025

విద్యుత్ షాక్‌కు గురై ఆరేళ్ల చిన్నారి మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. డి.హీరేహాళ్ మండలం మురిడికి చెందిన 6ఏళ్ల చిన్నారి అర్పిత స్నానం చేసేందుకు వెళ్తుండగా డోర్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహించి పడిపోయింది. గమనించిన తల్లి రూతమ్మ వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట విషాదం నింపింది.

Similar News

News March 13, 2025

చాహల్‌తో డేటింగ్ రూమర్స్: ఆర్జే మహ్వాష్ పోస్ట్ వైరల్

image

టీమ్ ఇండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ రూమర్స్ వేళ ఆర్జే మహ్వాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్వాష్ ఎంతో గర్విస్తోంది. నాకు కావాల్సింది కూడా ఇదే. మనం ఏ తప్పు చేయకుండా, అనవసర విషయాలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి’ అని పోస్టులో రాశారు. డేటింగ్‌పై వస్తున్న రూమర్స్‌పైనే ఆమె ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

News March 13, 2025

నెల్లూరు: నిరుద్యోగులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు

image

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సిస్టం, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, డిప్లమా విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కలవని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు అర్హులని అన్నారు. మరింత సమాచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News March 13, 2025

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

image

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.

error: Content is protected !!