News February 1, 2025
విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ దుర్మరణం

కర్నూలు(D) గోనెగండ్ల మండల పరిధిలోని కులుమాల గ్రామంలో విషాద ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గోనెగండ్ల గ్రామానికి చెందిన బోయ రంగస్వామి (46) ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.
Similar News
News March 6, 2025
నగర, పురపాలక సంస్థలకు నిధుల విడుదల

కర్నూలు నగర, 9 పురపాలక సంస్థలకు 2023-24కు గానూ 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.41.19 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కర్నూలుకు రూ.15.81 కోట్లు, గూడూరుకు రూ.1.08 కోట్లు, ఆదోనికి రూ.5.47 కోట్లు, ఎమ్మిగనూరుకు రూ.3.08 కోట్లు, నంద్యాలకు రూ.7.15 కోట్లు, ఆళ్లగడ్డకు రూ..82 కోట్లు, డోన్‌కు రూ.1.92 కోట్లు, నందికొట్కూరుకు రూ.1.63 కోట్లు, ఆత్మకూరుకు రూ.1.76 కోట్లు, బేతంచెర్లకు రూ.1.43 కోట్లు ఇచ్చింది.
News March 6, 2025
8న కర్నూలులో జాతీయ లోక్ అదాలత్

కర్నూలు జిల్లాలో ఈనెల 8వ తేదీన కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి విజ్ఞప్తి చేశారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న రాజీపడే సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.
News March 5, 2025
జగన్.. జైల్‌కు తక్కువ, బెయిల్‌కు ఎక్కువ: శబరి

‘పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ. ఎమ్మెల్యేకు తక్కువ. జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు’ అంటూ మాజీ సీఎం <<15658870>>జగన్<<>> చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా జగన్ వ్యాఖ్యలకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కౌంటర్ ఇచ్చారు. ‘ఈయన గారు జైల్‌కు తక్కువ, బెయిల్‌కు ఎక్కువ’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు జగన్ కామెంట్స్‌పై కూటమి నేతలు మండిపడుతున్నారు.