News February 20, 2025
విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొద్దు: KMR కలెక్టర్

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కాకతీయ నగర్ లోని 33/11 కే.వి. ఉప కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. విద్యుత్ ఎంత మేరా సరఫరా అవుతుంది. సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు తీసుకునే ప్రత్యామ్నాయ చర్యలు, తదితర విషయాలను ఎస్ఈ ఎన్.శ్రావణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 21, 2025
HYD: ఓయూ సర్కులర్‌పై హైకోర్టు స్టే

ఓయూ జారీ చేసిన సర్క్యులర్ మీద హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఓయూ పరిధిలో ధర్నాలు, నిరసనలు బ్యాన్ చేస్తూ ఓయూ అధికారులు ఈ నెల 13వ తేదిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని రఫీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఓయూ రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.
News March 21, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్టీవో, పోలీస్ అధికారులకు సూచించారు. అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో గుర్తించి బ్లాక్ స్పాట్లుగా నమోదు చేయాలని తెలిపారు.
News March 21, 2025
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258కోట్లు

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రధాని పర్యటనల ఖర్చును తెలపాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు చేయగా రూ. 258కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకు అధికంగా రూ.22కోట్లు ఖర్చు జరిగినట్లు తెలిపింది.