News March 28, 2025

విద్య ద్వారానే అసమానతలకు ముగింపు: ప్రొఫెసర్ బి శివారెడ్డి

image

విద్య ద్వారానే అసమానతలు తొలగుతాయని ప్రొఫెసర్ బి. శివారెడ్డి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. విద్య ద్వారానే సామాజిక అభివృద్ధి జరుగుతుందని, అసమానతలు తొలగుతాయని అన్నారు. విద్య పైన బడ్జెట్ కేటాయింపులు ఉండాలని పేర్కొన్నారు.

Similar News

News November 10, 2025

NHSRCలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

image

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌(NHSRC)లో 4 పోస్టులకు దరఖాస్తులు చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, బీకామ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, బీహెచ్ఎంస్, బీఏఎంస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://nhsrcindia.org/

News November 10, 2025

హనుమాన్ చాలీసా భావం – 5

image

హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై ||
హనుమంతుని ఒక చేతిలో ఎంతటి శత్రువునైనా మట్టుబెట్టేంత శక్తి కలిగిన వజ్రాయుధం(గద), మరో చేతిలో విజయానికి ప్రతీకైన పతాకం ప్రకాశిస్తుంటాయి. ఆయన భుజంపై ఉండే జంధ్యం ఆయన అపారమైన శక్తి, విజయం మరియు, సూచిస్తుంది. మనం కూడా హనుమంతునిలా ధైర్యాన్ని, సత్యాన్ని ఆశ్రయిస్తే జీవితంలో తప్పక విజయం సాధిస్తాం. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 10, 2025

అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు

image

ప్రముఖ కవి, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డా.అందెశ్రీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటన్నారు. అందెశ్రీ మరణం పట్ల మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాటతో పాటు ఎన్నో ఉద్యమ గీతాలు రాసిన ప్రజాకవికి శ్రద్ధాంజలి అని ట్వీట్ చేశారు. పలువురు ఏపీ మంత్రులు అందెశ్రీకి నివాళి అర్పించారు.