News February 18, 2025
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ

కర్నూలులోని 4వ పట్టణ పోలీసు స్టేషన్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేరాలు జరగకుండా నిత్యం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.
Similar News
News October 31, 2025
సీఎం చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: తిక్కారెడ్డి

‘మొంథా’ తుఫాను సమయంలో ప్రజలను కాపాడిన సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని జగన్ తప్పుబట్టడం ఆశ్చర్యకరమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి శుక్రవారం విమర్శించారు. తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం లేకుండా చూసిన చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయడం జగన్కు తగదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినా గడప దాటని జగన్, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.
News October 31, 2025
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో 91 శాఖల అధికారులతో మూడు రోజుల పాటు జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్టాండ్ అప్ ఇండియా పథకంపై అవగాహన పెంచాలని, నాబార్డ్ ద్వారా ఆర్ఐడీఎఫ్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు.
News October 31, 2025
మ్యాట్రి’మనీ’ మోసాలపై కర్నూలు ఎస్పీ హెచ్చరిక

వివాహ సంబంధిత వెబ్సైట్లు, యాప్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న మ్యాట్రిమోనియల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం హెచ్చరించారు. నకిలీ పేర్లు, ఆకర్షణీయమైన ఫొటోలతో కూడిన ప్రొఫైల్స్ నమ్మి అమాయకులు మోసపోతున్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. మోసపోయిన వారు ఆన్లైన్ ఫిర్యాదుల కోసం www.cybercrime.gov.inలో సంప్రదించాలని ఎస్పీ సూచించారు.


