News December 20, 2024

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ అన్ని అంశాలలో పూర్తిగా వెనుకబడినట్లు గుర్తించామని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్లో ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనితీరు గురించి ఇన్‌ఛార్జ్ పీడీ వరలక్ష్మితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News January 24, 2025

పెండింగ్ పనులను పరిష్కరించండి: కలెక్టర్ చేతన్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న రహదారులకు సంబంధించి పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారులు, రైల్వేలు, అటవీశాఖ, చిన్న నీటిపారుదలపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ సమస్యలను వారంలోపు పరిష్కరించాలని ఆదేశించారు.

News January 23, 2025

రొళ్లలో యువకునిపై పోక్సో కేసు

image

రొళ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన కిరణ్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలాజీ తెలిపారు.17 ఏళ్ల వయసున్న బాలిక ఈనెల 2వ తేదీ నుంచి అదృశ్యమైనట్లు బాలిక తల్లిదండ్రులు 4వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఘటన దర్యాప్తులో ఉండగా బుధవారం సాయంత్రం బాలిక ఇంటికి చేరుకొని కిరణ్ అత్యాచారం చేసినట్లు తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News January 23, 2025

సోమందేపల్లి: బంగారమని చెప్పి భారీ మోసం

image

నకిలీ నగలను బంగారమని చెప్పి అమ్మి మోసం చేసే ముఠాను సోమందేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు.. పొలాన్ని దున్నుతుంటే బంగారు హారాలు లభ్యమయ్యాయని, తక్కువకే ఇస్తామని ఇద్దరిని మోసం చేశారని తెలిపారు. వారి ఫిర్యాదుతో హిందూపురం – పెనుకొండ వైపుకు వస్తుండగా 10 మందిని పట్టుకోగా..నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద రూ. రూ.21 లక్షలు, 5 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.